Home South Zone Andhra Pradesh రహదారులపై భద్రతే ప్రజల జీవితాలకు రక్ష: జిల్లా కలెక్టర్

రహదారులపై భద్రతే ప్రజల జీవితాలకు రక్ష: జిల్లా కలెక్టర్

0

మదనపల్లి బైపాస్ రోడ్డులోని పీపీఆర్ ఫంక్షన్ హాల్‌లో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సభలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు.

రహదారి భద్రత ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన అన్నారు. హిట్ అండ్ రన్ ప్రమాదాల్లో మృతి చెందితే రూ. 2 లక్షలు, గాయపడితే రూ. 50 వేలు పరిహారం అందిస్తామని, గోల్డెన్ అవర్‌లో బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారికి రూ. 25 వేలు నగదు బహుమతి ఇస్తామని తెలిపారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Exit mobile version