మదనపల్లి మండలం కొండామర్రిపల్లిలో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. బయోమెట్రిక్ విధానంలో లబ్ధిదారుల ఇంటి వద్దనే వేలిముద్ర తీసుకుని నగదు అందిస్తున్న విధానాన్ని ఆయన పరిశీలించారు.
లబ్ధిదారులతో మాట్లాడి పింఛన్ సకాలంలో అందుతోందా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో తాగునీటి సమస్యలపై కూడా విచారణ చేసి, సురక్షిత నీరు అందేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు.




