Sunday, February 1, 2026
spot_img
HomeSouth ZoneTelanganaహెల్త్ సెంటర్ మార్బుపై నిరసన - రంగంలోకి కార్పొరేటర్ .|

హెల్త్ సెంటర్ మార్బుపై నిరసన – రంగంలోకి కార్పొరేటర్ .|

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : స్థానిక వెంకటాపురం లోని సుభాష్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ లోకి మార్చాలనే ప్రతిపాదనను నిరసిస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కమిటీ సభ్యులు చేపట్టిన ఆందోళనకు కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె కమిటీ సభ్యులతో కలిసి నిరసనలో పాల్గొన్నారు.

ఈ మేరకు సమస్యను వివరిస్తూ డిప్యూటీ కమిషనర్ (DC) కి వినతిపత్రం సమర్పించారు. దశాబ్దాలుగా పేద ప్రజల వివాహాలు, శుభకార్యాలు, మరియు ఇతర సామాజిక కార్యక్రమాలకు వేదికగా ఉన్న, ఈ కమ్యూనిటీ హాల్ ను యధావిధిగా కొనసాగించాలని వారు కోరారు. ఆరోగ్య కేంద్రాన్ని ఇక్కడికి మార్చడం వల్ల స్థానికులకు ఫంక్షన్ హాల్ సౌకర్యం దూరమవుతుందని, కావున ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో.. అనిల్ కిషోర్, ప్రేమ్, అరుణ్, సెంథిల్, సెల్వరాజ్, రాజు, ముత్తు లక్ష్మి, విజయ్, రామానుజం, అముల్, సురేష్, మరియు ఇతర కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

#sidhumaroju
Alwal

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments