Home South Zone Andhra Pradesh అంతర్జాతీయ జానపద గాయకులు శ్రీ దామోదర గణపతి రావు గారు

అంతర్జాతీయ జానపద గాయకులు శ్రీ దామోదర గణపతి రావు గారు

0

వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ , బ్రహ్మయ్య కాలనీ , రామ రాజ్య నగర్ , కబేళ సెంటర్ , విద్యాధరపురం, విజయవాడ – 520012, NTR జిల్లా….

ది:-01-02-2026 అంతర్జాతీయ జానపద గాయకులు గురువుగారు
శ్రీ దామోదర గణపతి రావు గారి జన్మదినోత్సవ సందర్భంగా శ్రీకృష్ణ దేవరాయ సమాజ సేవా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బోండా జగన్మోహన్ రావు గారి గ్రీజన గీత శిల్పి వారి స్వగృహం హౌసింగ్ బోర్డు కాలనీ నందు గణపతరావు గారు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

నిన్న ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు తర్వాత విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

మన వెంకట్ మహేశ్వర్ చారిటబుల్ ట్రస్ట్ అందరికోసం ఆపన్నహస్తం తరుపున హృదయపూర్వక గణపతి మాస్టారు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు సంపూర్ణ జీవితాన్ని గడపాలని ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఈ కార్యక్రమంలో మన ట్రస్ట్ ని ఆహ్వానం మేరకు వెళ్లి దామోదర గణపతి రావు గారిని మన సంస్థ యొక్క జ్ఞాపిక మరియు శాలువాతో సత్కరించడం ఎంతో ఆనందించదగిన గర్వించదగిన విషయం

ఈ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్నవారు ట్రస్ట్ చైర్మన్ ముత్తంశెట్టి దుర్గ కిషోర్ క్రిష్ ముఖ్య సేవ సభ్యులు లక్ష్మీ శ్రీనివాస్,పిట్టల దుర్గాప్రసాద్, క్రాంతి కుమార్, శ్రీమతి కోమలి , సాయి కిషోర్ శ్రీ ఆకుల శ్రీనివాస్ కుమార్ గారు, రాజేంద్రప్రసాద్ గారు, ఉప్పాల సత్యవతి గారు, కంకటాల జ్ఞానేశ్వరి గారు, గీతా గారు ,మీసాల రమణగారు, నరహరిశెట్టి శ్రీహరి గారు కొనిజేటి రమేష్ గారు, పైలా పాపారావు గారు, అబ్దుల్ ఖాదర్ గారు, అల్లం పూర్ణచంద్రరావు గారు, ఆకుల ప్రసాదు గారు, యు లక్ష్మీనారాయణ గారు, కోరగంజి భాను గారు, గర్రె ప్రసాద్ గారు, తదితరులు హాజరైయ్యారు

NO COMMENTS

Exit mobile version