సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా గూడూరి ఎరిక్షన్ బాబు గారు
సభ్య సమాజం సిగ్గుపడేలా అంబటి వ్యాఖ్యలు – ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా ఆ పార్టీ నేతల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి పవిత్రమైన శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసి ఇంకా సిగ్గు లేకుండా బుకాయిస్తారా? అంటూ మండిపడ్డారు.
గొడవలు రాజేసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు జగన్ అండ్ కో కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి, లేకుంటే ప్రజలే తరిమి కొడతారని
