Home South Zone Telangana కాగజ్‌నగర్‌లో 26 బాండెడ్ లేబర్లకు విముక్తి: సబ్ కలెక్టర్

కాగజ్‌నగర్‌లో 26 బాండెడ్ లేబర్లకు విముక్తి: సబ్ కలెక్టర్

0

కాగజ్‌నగర్‌లో 26 బాండెడ్ లేబర్లకు విముక్తి: సబ్ కలెక్టర్
కాగజ్‌నగర్ మండలం ఈస్గాం గ్రామ పరిధిలోని బెంగాలీ క్యాంప్ నంబర్–12లో ఉన్న ఇటుక బట్టీల్లో బాండెడ్ లేబర్లుగా పనిచేస్తున్న 26 మందిని గుర్తించి విముక్తి కల్పించినట్లు సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా తెలిపారు.

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టి, విముక్తి పొందిన కార్మికులను ఆదివారం కేరళ ఎక్స్‌ప్రెస్ రైలులో ఒడిశా రాష్ట్రం బలంగిరి జిల్లా వారి స్వగ్రామాలకు సురక్షితంగా తరలించినట్లు ఆమె వెల్లడించారు. బాండెడ్ లేబర్ వ్యవస్థ నిర్మూలనకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

NO COMMENTS

Exit mobile version