Tuesday, February 3, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshకొల్లబైలులో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం - పునీత్.

కొల్లబైలులో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం – పునీత్.

మదనపల్లి మండలం కొల్లబైలు పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ 629/2 ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా ప్లాట్లు విక్రయిస్తున్నారని బహుజన యువసేన (BYS) అధ్యక్షుడు పునీత్ కుమార్ జిల్లా కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు.

హైకోర్టు కేసు కొనసాగుతున్నప్పటికీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ పనులు జరుగుతున్నాయని, అధికారుల అండదండలతోనే అక్రమాలు సాగుతున్నాయని ఆయన ఆరోపించారు. తక్షణమే విచారణ చేసి అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments