మదనపల్లి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్‌ఎస్ అర్జీలకు సకాలంలో.
నాణ్యతతో పరిష్కారం చూపాలని, అర్జీలపై ఆడిట్ నిర్వహించి పెండింగ్ లేకుండా పరిష్కరించాలని, అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో అధికారులు క్రమశిక్షణతో లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.






