మహబూబాబాద్/కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 3: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఐదు సంవత్సరాల సర్వీస్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రిన్సిపాల్ బి. వెంకన్న గారిని కళాశాల అధ్యాపక బృందం ఘనంగా సత్కరించింది.
గత ఐదేళ్లుగా కళాశాల అభివృద్ధిలో, విద్యార్థుల క్రమశిక్షణ మరియు ఉత్తీర్ణత శాతాన్ని పెంచడంలో వెంకన్న గారు విశేష కృషి చేశారని అధ్యాపకులు కొనియాడారు. పరిపాలనలో ఆయన చూపిస్తున్న దక్షత, అందరినీ కలుపుకుపోయే తత్వం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు ఆయనకు శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించి, మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ప్రిన్సిపాల్ వెంకన్న మాట్లాడుతూ.. తన ఐదేళ్ల ప్రస్థానంలో సహకరించిన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. సమిష్టి కృషితోనే కళాశాలను మరింత ముందుకు తీసుకువెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీనియర్ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
