Home South Zone Andhra Pradesh భార్యపై భర్త కిరాతకం: న్యాయం కోసం బాధితురాలి ఆవేదన.

భార్యపై భర్త కిరాతకం: న్యాయం కోసం బాధితురాలి ఆవేదన.

0

మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలం కాపల్లి పంచాయతీ బాపనవారిపల్లికి చెందిన సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి తన భార్య విజయను ఆదివారం రాత్రి కిరాతకంగా కొట్టారు. తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం ఏర్పడి ప్రేమ కులాంతర వివాహం చేసుకున్నామని, ఇరు కుటుంబాల పెద్దలకు నచ్చకపోవడంతో మొదటి నుంచి తనపై శారీరక.

మానసిక వేధింపులు కొనసాగుతున్నాయని బాధితురాలు విజయ వాపోయారు. ఇటీవల భర్త సుధాకర్ రెడ్డి తీవ్రంగా దాడి చేసి గాయపరిచాడని, అయినప్పటికీ తనకు ఇప్పటివరకు న్యాయం జరగలేదని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులు వెంటనే స్పందించి భర్తపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆమె కోరారు.

NO COMMENTS

Exit mobile version