మదనపల్లె మండలం, పోతబోలు పంచాయతీ, శానిటోరియం సమీపంలోని తురకపల్లెకు చెందిన గఫూర్ ఖాన్, బుడాన్ భీ దంపతులకు ముగ్గురు కుమారులు ఖాదరవల్లి, సైఫుల్లా, జాఫర్ వల్లీలు ఉన్నారు.
వంశపారంపర్యంగా పాడి ఆవులను మేపి పాలు విక్రయిస్తూ బాగా స్థిరపడినప్పటికీ, తల్లిదండ్రుల ఇంటి స్థలాన్ని ఖాళీ చేయమని ఒత్తిడి చేసి, వారం రోజుల క్రితం జెసిబి ద్వారా ఇంటిని కూల్చివేశారు.
ఈ దాడులు, భయభ్రాంతులకు గురి చేసిన కొడుకులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితులు కలెక్టర్‌ను కలసి సోమవారం ఫిర్యాదు చేశారు.




