కర్నూలు :
కర్నూలు సిటీ :
కర్నూలు నగరంలోని కూడళ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించి వాహన రాకపోకలు సులభతరం చేయడమే లక్ష్యంగా అవసరమైన ప్రాంతాల్లో కూడళ్ల ఏర్పాటు చేసి వాటిని ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం ఆయన శివాజీ మహారాజ్ ఛత్రపతి (వై.జంక్షన్) కూడలిని పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని కూడళ్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడలిని రూ.54 లక్షల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు రమణ మూర్తి, డిసిపి వెంకటరమణ, డిఈఈ గిరిరాజ్, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, టిఏఈ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.




