సిటిఎం గంగమ్మ జాతర సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సోమవారం మదనపల్లి డీఎస్పీ మహేంద్ర తెలిపారు. జాతరలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు.
రాజకీయ పాటలు, రికార్డింగ్ డాన్సులు, వివాదాస్పద వ్యాఖ్యలకు అనుమతి లేదని, భక్తులు విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవాలని, పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, గొడవలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, సీసీ కెమెరాల నిఘా, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.
