అన్నమయ్య జిల్లాలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠాను బి.కొత్తకోట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మదనపల్లి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, డీఎస్పీ మహేంద్ర తెలిపిన వివరాల ప్రకారం, పీటీఎంలోని మల్లెలగ్రామం
పెద్దమేకలపల్లికి చెందిన వెంకటరమణరెడ్డి పొలంలో పండించే గంజాయిని కొత్తకోట సురేంద్ర (డిమ్మర్), అఫ్రీద్, పురుషోత్తం, ఆదిల్ ముఠాగా ఏర్పడి విక్రయించేవారు. వీరి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.




