Tuesday, February 3, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshతండ్రిని మోసం చేసిన కూతురు – ఎస్పీకి వృద్ధ దంపతుల ఫిర్యాదు.

తండ్రిని మోసం చేసిన కూతురు – ఎస్పీకి వృద్ధ దంపతుల ఫిర్యాదు.

ఇంటి మరమ్మత్తుల పేరుతో పత్రాలపై సంతకాలు చేయించుకుని, ఇల్లు తన పేరున రిజిస్టర్ చేసుకుని, అనంతరం ఇంటి నుంచి తరిమేశారని ఆరోపిస్తూ వృద్ధ దంపతులు అన్నమయ్య జిల్లా ఎస్పీకి సోమవారం ఫిర్యాదు చేశారు.

మదనపల్లికి చెందిన షేక్ అబ్దుల్ మజీద్ (89), షానాజ్ బేగం దంపతులు తమ రెండో కుమార్తె షేక్ రఫియా, ఆమె భర్త షేక్ మొహమ్మద్ తమను మోసం చేశారని ఆరోపించారు.

ఇంటి పన్ను చెల్లించేందుకు వెళ్లగా ఇల్లు తమ పేరుపై లేదని తెలిసిందని, ప్రశ్నించగా వేధింపులకు, దాడులకు పాల్పడుతున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని వారు ఎస్పీని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments