Home South Zone Andhra Pradesh రైతు పొలంలో పైపులైన్లు, స్ప్రింకర్ల ధ్వంసం – ఎస్ఐకి ఫిర్యాదు.

రైతు పొలంలో పైపులైన్లు, స్ప్రింకర్ల ధ్వంసం – ఎస్ఐకి ఫిర్యాదు.

0

చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలోని రెడ్డివారిపల్లి గ్రామంలో రైతు టి. కుమార్ పొలంలో అమర్చిన పైపులైన్లు, స్ప్రింకర్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మంగళవారం బాధితుడు ఎస్ఐ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు.

గతంలో ఆస్తి వివాదాలున్న వేమారెడ్డి చంద్రారెడ్డిలే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

NO COMMENTS

Exit mobile version