Home South Zone Andhra Pradesh సీఎం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు – వైసీపీ నేతలు.

సీఎం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు – వైసీపీ నేతలు.

0

సీఎం చంద్రబాబు నాయుడు నియంతలా వ్యవహరిస్తూ, కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైసీపీ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించాలని కోరుతూ సోమవారం మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

శ్రీవారి లడ్డూ అంశంపై నివేదిక ఉన్నప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వైసీపీకి వ్యతిరేక ఫ్లెక్సీలపై ప్రశ్నిస్తే దాడులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే నిసార్ అహమ్మద్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తోందని తెలిపారు.

NO COMMENTS

Exit mobile version