Tuesday, February 3, 2026
spot_img
HomeSouth ZoneTelanganaహర్యానా కమ్యూనిటీతో ఈటల సమ్మేళనం |

హర్యానా కమ్యూనిటీతో ఈటల సమ్మేళనం |

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అల్వాల్ పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్ పంచశీల కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న హర్యానా కమిటీ సభ్యులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి  చంద్రశేఖర్ తివారి,  జైపూర్ ఎంపీ అశోక్ పర్నామి, హర్యానా రాజ్యసభ సభ్యురాలు రేఖ  స్వప్న (రేఖ శర్మ ) ఈ పర్యటనలో భాగస్వామ్యమయ్యారు.  ఇతర రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు సైతం ఈ పర్యటనకు రావడం స్థానికంగా ప్రాధాన్యత సంతరించుకుంది
స్థానికంగా ఎదుర్కొంటున్న మౌలిక  సమస్యలను  నేతల దృష్టికి తీసుకువచ్చారు.

స్థానిక సమస్యలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈటల రాజేందర్ అడిగి తెలుసుకున్నారు.  కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిజెపి శ్రేణులను సమాయత్వం చేస్తూ పార్టీ బలోపేతంపై దిశా నిర్దేశం చేశారు.  మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై ఎంపి ఈటల రాజేందర్, ఇప్పటికే కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పంచశీల కాలనీ వాసుల మద్దతు కోరుతూ,, అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని నేతలు స్పష్టం చేశారు.
వీరితో పాటు ఈ పర్యటనలో  బిజెపి మేడ్చల్  అర్బన్ సెక్రటరీ చింతల మాణిక్య రెడ్డి, పార్టీ నాయకులు పిట్ల నగేష్, శ్రీనివాస్ వర్మ,  సూర్య  పంచశీల కమిటీ ప్రెసిడెంట్ రాజేందర్, మరియూ కమిటీ సభ్యులు  పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments