పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయం వద్ద సోమవారం కూటమి నాయకులు కల్తీ నెయ్యి వ్యవహారంపై నిరసన తెలిపారు.
జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్న రాయల్ మాట్లాడుతూ, గత వైసిపి ప్రభుత్వంలో పాలు లేకుండానే కల్తీ నెయ్యితో స్వామివారి లడ్డు తయారు చేశారని ఆరోపించారు. రానున్న రోజుల్లో వైసిపి పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.




