Tuesday, February 3, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా.

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా.

అన్నా లెజినోవాకు ఘన స్వాగతం పలికిన ధర్మకర్తలు
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అన్నా లెజినోవా

వేదాశీర్వచనం అందించిన అర్చకులు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మంగళవారం వరంగల్ వచ్చిన ఆమె భద్రకాళి గుడికి వచ్చారు. అన్నా లెజినోవాకు ఆలయ ధర్మకర్తలు, పూజారులు ఘనస్వాగతం పలికారు.

ఆదిశంకరాచార్యులు, వల్లభ గణపతిని దర్శించుకున్న అనంతరం ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మండపంలో ప్రధాన అర్చకులు వెంకటనాగరాజు శర్మ, వేదపండితులు ప్రదీప్ కుమార్ శర్మ ఆమెకు ఆశీర్వాదం అందించి, అమ్మవారి శేషవస్త్రాలు బహూకరించి తీర్థప్రసాదాలు అందజేశారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments