Wednesday, February 4, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshతిరుమలలో తగ్గిన రద్దీ; దర్శనానికి అనువైన సమయం

తిరుమలలో తగ్గిన రద్దీ; దర్శనానికి అనువైన సమయం

టెన్త్, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామి వారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. దర్శనం టోకెన్లు లేకపోయినా 5 – 6 గంటల్లో స్వామి వారి దర్శనం అయిపోతోంది. రూ. 300ల శీఘ్ర దర్శనానికి ఒకటి నుంచి రెండు గంటల సమయం మాత్రమే పడుతోంది. ఉచిత దర్శనం కోసం భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

నిన్న శ్రీవారిని 69,389 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 20,247 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.72 కోట్ల ఆదాయం వచ్చింది. విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యేంత వరకు భక్తుల రద్దీ సాధారణంగా ఉండే అవకాశం ఉంది. తిరుమలకు వెళ్లాలనుకునే వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments