Home South Zone Andhra Pradesh సీఎం పర్యటనకు గుంటూరు పోలీసుల కట్టుదిట్టమైన భద్రత |

సీఎం పర్యటనకు గుంటూరు పోలీసుల కట్టుదిట్టమైన భద్రత |

0
0

గుంటూరు  తేదీ 05.02.2026 న తుళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయపూడి గ్రామం వద్ద, ఎంఎల్ఏ క్వార్టర్స్ నుండి హైకోర్టు వైపు వెళ్లే రహదారిలో ఉన్న పెరేడ్ గ్రౌండ్ లో “మన నీరు – మన భవిష్యత్తు : నీటి వినియోగదారుల సంఘాల పాత్ర” అనే కార్యక్రమం నిర్వహించబడనున్నది.

ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హాజరుకానున్న నేపథ్యంలో, గుంటూరు జిల్లా పోలీస్ శాఖ విస్తృత స్థాయిలో భద్రతా మరియు బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది.
గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, జిల్లా అదనపు ఎస్పీ (L&O) శ్రీ ఏటీవీ రవికుమార్ గారు, తుళ్లూరు డిఎస్పీ శ్రీ మురళీ కృష్ణ గారు బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అమలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారీయా ఐఏఎస్ గారికి, చేపట్టిన భద్రతా మరియు బందోబస్తు చర్యలపై పోలీస్ అధికారులు వివరాలను అందజేశారు.
ఈ కార్యక్రమానికి సుమారు 6,000 మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్ రద్దీ నివారణ దృష్ట్యా ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటు, ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ అమలు, ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాల కేటాయింపు చేయబడినట్లు తెలిపారు. ట్రాఫిక్ పోలీసులను మోహరించి, నిరంతర పర్యవేక్షణతో వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రయాణ మార్గంలో వీఐపీ రూట్ క్లియరెన్స్, రూట్ సెక్యూరిటీ, రూట్ మ్యాప్ ప్రకారం బందోబస్తు ఏర్పాటు, అనుమానితులపై ప్రత్యేక నిఘా, ప్రయాణ మార్గం మొత్తం ముందస్తు తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
సభా ప్రాంగణంలో అంచెల వారీగా బందోబస్తు ఏర్పాటు చేసి.

ప్రవేశ ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ, తగిన సంఖ్యలో భద్రతా సిబ్బంది మోహరింపు వంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు తగిన సంఖ్యలో పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని నియమించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ అషుతోష్ శ్రీవాత్సవ ఐఏఎస్ గారు, జిల్లా అదనపు ఎస్పీ గారు, గుంటూరు ఆర్డీఓ శ్రీనివాసరావు గారు, తుళ్లూరు డిఎస్పీ గారు, తుళ్లూరు ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు గారు, తుళ్లూరు పోలీస్ స్టేషన్ సీఐ మాతంగి శ్రీనివాసరావు గారు తదితర అధికారులు పాల్గొన్నారు.

NO COMMENTS