మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మచ్చబొల్లారం పరిధిలోని హిందూ స్మశాన వాటిక స్థలంలో కొనసాగుతున్న చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ ను యుద్ధ ప్రాతిపదికన తరలించాలని మచ్చ బొల్లారం జాయింట్ యాక్షన్ కమిటీ(JAC) డిమాండ్ చేసింది.
ఈ మేరకు గురువారం అల్వాల్ జిహెచ్ఎంసి కార్యాలయంలో మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ ను జేఏసీ ప్రతినిధులు కలిసి వినతి పత్రం అందజేశారు.
మానవ హక్కుల కమిషన్ ఆదేశాల అమలుపై ఒత్తిడి :
ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధి బి.ఎస్ ఉదయ్ ప్రకాష్ మాట్లాడుతూ.. మచ్చ బొల్లారం సర్వే నంబర్ 199లోని హిందూ స్మశాన వాటిక స్థలాన్ని చెత్త ట్రాన్స్ ఫర్ స్టేషన్ గా వినియోగించడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై గతంలోనే జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) స్పందించి, ఆ స్టేషన్ న్ను వెంటనే నిలిపివేసి, మరో చోటికి తరలించాలని ఆదేశిందని గుర్తు చేశారు.
మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి అధికారులు ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై మరో వారం రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉంటుందని ఉదయ్ ప్రకాష్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో గడువు ముగిసేలోగా తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, జోనల్ కమిషనర్, మరియు డిప్యూటీ కమిషనర్లను కోరినట్టు ఆయన తెలిపారు.
హిందు స్మశాన వాటిక వంటి పవిత్ర స్థలంలో చెత్త నిలువ చేయడం, ఏమాత్రం సమంజసం కాదని, స్థానికుల ఆరోగ్యం మరియు మనోభావాలను పరిగనలోకి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మచ్చ బొల్లారం జేఏసి సభ్యులు, వీరేందర్, అజయ్ రెడ్డి, పుష్ప, ఉమా, తదితరులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.
అధికారుల స్పందనను బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందని జెఏసి ప్రతినిధులు స్పష్టం చేశారు.
#sidhumaroju
Alwal




