Home South Zone Andhra Pradesh సముద్ర స్నానంలో విద్యార్థుల గల్లంతు |

సముద్ర స్నానంలో విద్యార్థుల గల్లంతు |

0

చిన్నగంజాం:
పుట్టినరోజు వేడుకలో భాగంగా సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు స్నేహితులు
ఇద్దరు విద్యార్థుల గల్లంతు, ఇద్దరు క్షేమం రెవిన్యూ, పోలీస్, మెరైన్, అగ్నిమాపక శాఖ గాలింపు చర్యలు
పుట్టినరోజు వేడుకలు ఆ కుటుంబంలో విషాదం నింపాయి. సరదాగా గడపటానికి వెళ్లిన నలుగురిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు కాగా, ఇద్దరు క్షేమంగా ఓడినే ఉన్నారు. చిన్నారుల గల్లంతుతో ఆయా కుటుంబాలు విషాదంతో వేదనకు గురవుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం,
పర్చూరు నియోజకవర్గం దుద్దుకూరు గ్రామానికి చెందిన చందులూరి శ్రీరామ్ (15) పుట్టినరోజు సందర్భంగా దుద్దుకూరు జడ్పీ హైస్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న తోటి స్నేహితులు బిక్కి అవినాష్, తాటిపర్తి హేమంత్, గుంజి హేమవర్ధన్ నలుగురు విద్యార్థులు గురువారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఒక బైక్ మీద చిన్నగంజాం మండలం బాపయనగర్ బీచ్ దగ్గర సముద్రంలో మునగడానికి వెళ్లారు. అవినాష్, శ్రీరామ్ ఇద్దరు సముద్రంలో నీట మునిగి ఆచూకీ తెలియలేదు.

హేమంత్, హేమ వర్ధన్ సముద్రం ఒడ్డునే ఉండటంతో క్షేమంగా ఉన్నారు. సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు, స్థానిక పోలీస్, రెవిన్యూ, అగ్నిమాపక శాఖ అధికారుల సమన్వయంతో ఆచూకీ లేకుండా పోయిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో జిల్లాలోని తీర ప్రాంతం ఉలిక్కిపడింది. విద్యార్థులు గల్లంతు కావడం పట్ల స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.

#Narendra

NO COMMENTS

Exit mobile version