వడ్డమాను లోరైతులు, ప్రజలు కోరుతున్న విధంగా గ్రామసభ నిర్వహించాలి
వడ్డమాను రైతులు, ప్రజల సమస్యలను, డిమాండ్స్ ను పరిగణలోకి తీసుకోవాలి
సిపిఎం డిమాండ్
వడ్డమాను గ్రామంలో గురువారం నాడు పర్యటించి రైతులు, కూలీలను కలిసి సమస్యలు తెలుసుకున్న సిపిఎం బృందం
ఈ బృందంలో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి డివిజన్ నాయకులు జొన్నకూటి నవీన్ ప్రకాష్ పి బాబురావు గైరబోయిన నాగేశ్వరరావు శ్రీనివాసరావు లు ఉన్నారు
అనంతరం తుళ్లూరులో జరిగిన ప్రెస్ మీట్ లో సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ మాట్లాడుతూ
రాజధాని రెండో దశ పూలింగ్ లో భాగంగా ఇటీవల వడ్డమాను గ్రామంలో భూ సమీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని, దానికి ముందుగానే గ్రామంలోమంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ లు రైతుల తోసమావేశం జరిపిన సందర్భంలో పూలింగ్ కు వెళ్ళబోయే ముందు గ్రామంలో గ్రామ సభ నిర్వహించాలని
సి ఆర్ డి ఏ చట్టంలో అనేక మార్పులు చేయాలని రైతులు కోరారని తెలిపారు
గ్రామసభ నిర్వహిస్తామని హామీ ఇచ్చి వెళ్లిన ప్రజాప్రతినిధులు గ్రామసభ నిర్వహించకుండానే పూలింగ్ నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల గ్రామ రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అన్నారు
గత రెండు రోజుల క్రితం రైతులు గ్రామ సభ నిర్వహించాలని కోరుతూ గ్రామంలో ఏర్పాటు చేసిన సిఆర్డిఏ కార్యాలయం కు ప్రదర్శనగా వెళ్లి వినతిపత్రం ఇచ్చారని అన్నారు
రిటర్నబుల్ ప్లాట్లు పరిమాణం పెంచాలని, కౌలు పెంచాలని, అభివృద్ధి కాలపరిమితి నిర్దిష్టంగా ఉండాలని మూడు నాలుగేళ్లలో ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలని ఆలస్యం అయ్యేట్లయితే అందుకు పరిహారం కూడా అదనంగా చెల్లించాలని, భూమిలేని పేదలకు ఇచ్చే సామాజిక పెన్షన్ను పదివేలకు పెంపుదల చేసి ఇవ్వాలని తదితర అనేక డిమాండ్లు గతంలోనే ప్రజాప్రతినిధుల దృష్టికి రైతులు తీసుకు వెళ్లడం జరిగిందని అన్నారు
ఈ డిమాండ్ల పట్ల ప్రభుత్వం ఏ రకమైన స్పందన లేకుండా ఏకపక్షంగా వడ్డమాను గ్రామంలోని 1937 ఎకరాల భూ సమీకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల రైతాంగం ప్రజానీకం అసంతృప్తితో ఉన్నారని అన్నారు
ప్రభుత్వం రైతులు, ప్రజల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే గ్రామసభ నిర్వహించాలని
వారి డిమాండ్లకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేతాజీ డిమాండ్ చేశారు
*మందడంలో మృతి చెందిన రామారావు కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి*
డిసెంబర్ 26వ తేదీ మందడం గ్రామంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు సభ నిర్వహిస్తున్న సందర్భంలోనే ఆవేదనకు గురై చనిపోయిన దొండపాటి రామారావు కుటుంబాన్ని ఆదుకుంటామని నేరుగా ముఖ్యమంత్రి ఫోన్ చేసి కుటుంబానికి హామీ ఇచ్చార నీ ,
40 రోజులు పైగా గడుస్తున్నప్పటికీ నేటికీ ఆ కుటుంబాన్ని ఆదుకునే విషయంలో ప్రభుత్వం వైపు నుంచి నిర్దిష్టమైన ప్రకటన వెలువడలేదని నేతాజీ అన్నారు
సిపిఎం పార్టీ 50 లక్షల రూపాయలు రామారావు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని
రామారావు కోరుకున్న పద్ధతుల్లో తమ ఇంటి స్థలానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చే స్థలం వారు కోరుకున్న చోట ఇవ్వాలని
కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నేతాజీడిమాండ్ చేశారు
ఈ విషయంలో ప్రభుత్వం ఎంత ఆలస్యం చేస్తే అంతగా ప్రభుత్వం మీద రామారావు కుటుంబానికే కాక, రైతులకు కూడా విశ్వాసం సన్నగిల్లుతుందని కావున తక్షణమే దీనిపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నట్లుగా నేతాజీ తెలిపారు




