దర్శి మండలం, రాజంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నవరం గ్రామంలో రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలను అధికారులతో కలిసి పంపిణీ చేసిన దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు , డా కడియాల లలిత్ సాగర్ గారు.
ఈ కార్యక్రమంలో దర్శి మండల తహసీల్దార్ ఎం. శ్రవణ్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు గారు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ గారు మాట్లాడుతూ “రైతుల భూమి రికార్డులన్నీ ఇకపై కంప్యూటర్‌లో భద్రంగా ఉంటాయి.
భూకబ్జాలకు తావు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.జనం ఆస్తులపై ఇక ఏ వ్యక్తి ఫొటోలు ఉండవు, కేవలం ప్రభుత్వ రాజముద్ర మాత్రమే ఉంటుంది అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో దర్శి మండల టీడీపీ అధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు, రాజంపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు తోట ఏడుకొండలు, గ్రామ నాయకులు ఫణితపు వెంకట్రామయ్య, ఫణితపు వెంకట్రావు, దామా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
