ఎన్. టి. ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ*
డ్రగ్స్ రహిత సమాజమే మా లక్ష్యం – ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనర్ శ్రీ.ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారు.*
ఎన్టీఆర్ జిల్లా పరిధిలో డ్రగ్స్ / గంజాయి వినియోగం పూర్తిగా నిర్మూలించాలనే ఉద్దేశంతో జిల్లా పోలీస్ శాఖ కఠిన చర్యలతో పాటు మానవతా దృక్పథంతో కూడా ముందుకు సాగుతోంది.
ప్రజలకు ముఖ్యంగా తల్లిదండ్రులకు తెలియజేయునది ఏమనగా మీ పిల్లలు గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడినట్లు మీకు అనుమానం కలిగినా లేదా నిర్ధారణ అయినా, వెంటనే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అధికారులను సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
ముందుగానే పోలీసులను సంప్రదిస్తే గంజాయి మానేందుకు అవసరమైన కౌన్సెలింగ్ & ట్రీట్మెంట్ అందించబడుతుంది, పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తగిన సహాయం, మార్గదర్శనం చేయబడుతుంది
అయితే గంజాయి లేదా డ్రగ్స్ వినియోగం / రవాణా / విక్రయం వంటి నేరాలలో పోలీసులకు చిక్కినట్లయితే, చట్టప్రకారం ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
డ్రగ్స్ రహిత భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, సమాజం అందరూ పోలీస్ వారితో సహకరించాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ వారు విజ్ఞప్తి చేస్తున్నారు.




