సౌర విద్యుత్ కాంతులతో విరజిల్లిన పాలుట్ల గిరిజన గూడెం – సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు…
యర్రగొండపాలెం మండలం నల్లమల అటవీప్రాంతంలోని పాలుట్ల గిరిజన గూడెంలో నివాసముంటున్న గిరిజన ప్రజలకు అవసరార్ధం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి సహకారంతో 2.86 కోట్ల రూపాయలతో సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని 611 గిరిజన కుటుంబాలకు వెలుగును కల్పించారు.
ఈ సందర్బంగా స్వయంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, కలెక్టర్ రాజబాబు గారు, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారు, టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొని కరెంట్ సౌకర్యాన్ని ప్రారంభించారు.
గిరిజనులు తమ నృత్యాలతో, పూల వర్షంతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారికి ఘన స్వాగతం పలికారు. తమకోసం సోలార్ విద్యుత్ అందించడమే కాకుండా స్వయంగా 50 కిలోమీటర్ల అడవి మార్గంలో ప్రయాణించి సోలార్ విద్యుత్ ప్రారంభించినందుకు గిరిజన ప్రజలు ధన్యవాదములు తెలిపారు.
అనంతరం గిరిజన ప్రజల తోటి భోజనం చేసిన మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు. కార్యక్రమంలో మార్కాపురం RDO గారు, ITDA PO గారు, ఎలక్ట్రికల్ SE గారు, అధికారులు, కూటమి నాయకులు, గూడెం ప్రజలు భారీగా పాల్గొన్నారు…





