Saturday, February 7, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshచీరాల: టీడీపీలోకి వైసీపీ కౌన్సిలర్ వెంకట్రావు

చీరాల: టీడీపీలోకి వైసీపీ కౌన్సిలర్ వెంకట్రావు

చీరాల: చీరాల 28వ మున్సిపల్ వార్డు వైసిపి కౌన్సిలర్ కీర్తి వెంకట్రావు శుక్రవారం రాత్రి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.చీరాల ఎమ్మెల్యే కొండయ్య, నియోజకవర్గం అధికార ప్రతినిధి మహేంద్రనాధ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా స్వాగతం పలిపారు. యువ నాయకుడు కీర్తి వెంకట్రావు చేరికతో టిడిపి పట్టణంలో మరింత బలం పుంజుకుందని వారు చెప్పారు.పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని భరోసా ఇచ్చారు. టిడిపి ప్రభుత్వ పాలనతో పాటు ఎమ్మెల్యే కొండయ్య పనితీరు నచ్చి టిడిపిలో చేరుతున్నట్లు కీర్తి వెంకట్రావు తెలిపారు.వార్డు అభివృద్ధిని,ప్రజల సంక్షేమాన్ని ఎప్పటికీ మర్చిపోనని వెంకట్రావు వెల్లడించారు.కాగా ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ జరిగింది. యువత కేరింతలు కొట్టారు.చివరగా పోలేరమ్మ ఆలయం వద్ద భారీ బహిరంగ సభ జరిగింది.దీంతో టీడీపీకి కొత్త జోష్ వచ్చింది.

#Narendra

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments