Sunday, February 8, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshజగన్ పరామర్శ యాత్రలో విషాదం: వైసీపీ నేత గుండెపోటుతో మృతి

జగన్ పరామర్శ యాత్రలో విషాదం: వైసీపీ నేత గుండెపోటుతో మృతి

Jagan Mohan Reddy: జగన్ పరామర్శ యాత్రలో విషాదం.. జోగి రమేశ్ ఇంటి సమీపంలో వైసీపీ నేత మృతి
06-02-2026 Fri 18:16 | Andhra

Jagans Visit Turns Tragic YSRCP Leader Dies Near Jogi Ramesh House
జగన్ పర్యటన నేపథ్యంలో జోగి రమేశ్ ఇంటికి వస్తున్న వైసీపీ నేత
పల్స్ పడిపోయి కుప్పకూలిన వైసీపీ నేత రాంబాబు
కాసేపటి క్రితం జోగి రమేశ్ ఇంటికి చేరుకున్న జగన్
వైసీపీ అధినేత జగన్ ఇబ్రహీంపట్నం పర్యటన సందర్భంగా విషాదం చోటుచేసుకుంది.

మాజీ మంత్రి జోగి రమేశ్ ను పరామర్శించేందుకు ఆయన తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నంకు బయల్దేరారు. ఈ క్రమంలో జోగి రమేశ్ ఇంటి సమీపంలో వైసీపీ నేత మృతి చెందారు. జగన్ వస్తున్న నేపథ్యంలో జోగి రమేశ్ ఇంటికి వెళుతున్న చిల్లకల్లు గ్రామ వైసీపీ అధ్యక్షుడు డి.రాంబాబు పల్స్ పడిపోయి కుప్పకూలారు. వెంటనే ఆయనను సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.

మరోవైపు కాసేపటి క్రితం జోగి రమేశ్ ఇంటికి జగన్ చేరుకున్నారు. ఆయన ఇంటిని పరిశీలించి, కుటుంబ సభ్యలను పరామర్శించారు.

జగన్ పర్యటన సందర్భంగా ఓ కుర్రాడు కూడా మరణించినట్టు తెలుస్తోంది. బైక్ పై విన్యాసాలు చేస్తూ బార్ గేట్ ను ఢీకొనడంతో అతడు మృత్యువాతపడినట్టు సమాచారం. మృతిచెందిన కుర్రాడిని ఇబ్రహీంపట్నంకు చెందిన భార్గవ్ గా గుర్తించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments