శనివారం మదనపల్లి మండలంలో ఆటో విషయంలో తలెత్తిన గొడవలో తల్లి, కొడుకులపై దాడి జరిగింది. సీటీఎం గ్రామానికి చెందిన వసంత, ఆమె కుమారుడు వినయ్ సీటీఎం జాతర నుండి తిరిగి వస్తుండగా, చిలకవారిపల్లికి చెందిన కార్తిక్ అనే వ్యక్తితో ఆటో ఎక్కడం విషయంలో గొడవ జరిగింది.
రాత్రికి ఈ వివాదం తీవ్రమై, కార్తిక్ వర్గీయులు వసంత, వినయ్‌లపై దాడి చేసి కొట్టినట్లు బాధితులు తెలిపారు. ఈ దాడిలో గాయపడిన తల్లి, కొడుకులను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
