1/3 కాఫీ ఇవ్వలేదని హోటల్ పై అధికారి ప్రతాపం…
1/3 కాఫీ ఇవ్వలేదని ఓ అధికారి హోటల్ ర్యాంప్ తొలగించేందుకు యత్నించాడు..
ఈ ఘటన వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటుచేసుకుంది..
పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద ఉన్న హోటల్ వద్దకు స్థానిక పురపాలిక అధికారి వెళ్లి ఒక కాఫీని మూడు భాగాలు చేసివ్వమని అడిగారు..
ఆ విధానం తన హోటల్లో లేదని యజమాని సమాధానమిచ్చారు. ఆగ్రహించిన అధికారి 15 నిమిషాల్లో పొక్లెయిన్ తెప్పించారు..
హోటల్ ఎదుట అక్రమంగా ర్యాంపు ఏర్పాటు చేశారని.. దాన్ని తొలగించేందుకు యత్నించారు..
పట్టణంలో కాలువలున్న చోటల్లా ర్యాంప్లున్నాయని, వాటినీ తొలగించాలని యజమాని డిమాండ్ చేశారు..
దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగింది..
ఒక దశలో యజమాని రోడ్డుపై పడుకొని పొక్లెయిన్‌ను అడ్డుకున్నాడు..
తనపైనుంచి పోనిచ్చి, ర్యాంప్‌ను తొలగించాలని నిరసన వ్యక్తం చేశారు..
చివరికి అధికారులు దిగివచ్చి తొలగింపు ప్రక్రియను విరమించారు…




