Home South Zone Andhra Pradesh శ్రీశైలం మల్లికార్జున ఉత్సవాలకు నారా లోకేష్ కు ఆహ్వానం

శ్రీశైలం మల్లికార్జున ఉత్సవాలకు నారా లోకేష్ కు ఆహ్వానం

0

శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం

ఉండవల్లి: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఫిబ్రవరి 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 11 రోజుల పాటు జరగనున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ఆహ్వానం పలికారు. ఈ మేరకు ఉండవల్లి నివాసంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేష్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు.

అధికారులు మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు మంత్రి లోకేష్ కు ప్రత్యేక ఆశీర్వచనాలు ఇచ్చారు. స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. మహానందిలో జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కూడా మంత్రి నారా లోకేష్ ను ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆహ్వానించారు.

NO COMMENTS

Exit mobile version