Saturday, February 7, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshసచివాలయ ఉద్యోగి కుటుంబానికి కలెక్టర్ ధ్యానచంద్ర భరోసా

సచివాలయ ఉద్యోగి కుటుంబానికి కలెక్టర్ ధ్యానచంద్ర భరోసా

విజయవాడ నగరపాలక సంస్థ
06-02-2026

స్వర్గీయ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి సహఉద్యోగులు అండగా నిలబడటం ఐక్యతకు చిహ్నం- విజయవాడ నగర కమిషనర్ ధ్యానచంద్ర

Rs. 300000/- Fixed Deposit Documents కుటుంబ సభ్యులకు అందజేత.

స్వర్గీయ సచివాలయ ఉద్యోగి కుటుంబానికి సహఉద్యోగులు అండగా నిలబడటం ఐక్యతకు చిహ్నమని విజయవాడ నగర కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. శుక్రవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని తమ చాంబర్లో స్వర్గీయ కళ్లేపల్లి విశ్వనాథ్ కుటుంబానకి, సచివాలయం కార్యదర్శిలు సమకూర్చిన

₹ 300000/- Fixed Deposit Documents అందజేసారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వర్గీయ కళ్లేపల్లి విశ్వనాథ్ కుటుంబానికి అండగా నిలబడినందుకు వార్డు సచివాలయం ఉద్యోగుల ఫెడరేషన్ నాయకులను అభినందించారు. ఈ కార్యం ఎంతో గొప్పదని, సహఉద్యోగి కుటుంబానికి సచివాలయం కార్యదర్శులందరూ అండగా నిలబడటం ఐక్యతకు చిహ్నమని, ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని ప్రయోజనాలను సాధ్యమైనంత త్వరగా మంజూరు చేయడానికి కృషిచేస్తామని తెలియజేశారు.

కళ్లేపల్లి విశ్వనాథ్ ఇద్దరు కూతుర్లకు ఒక్కొక్కరి పేరున Rs. 1,50,000/- చొప్పున మూడులక్షల రూపాయలను వారిద్దరి భవిష్యత్ అవసరాలకోసం జాతీయ బ్యాంకులో ఫిక్సడ్ డిపాజిట్ చేసి ఆ బాండ్లను, భార్య శ్రీమతి హస్మత్ కు అందజేశారని అన్నారు.

ఈ సందర్భంగా సెక్రెటరియట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు మాట్లాడుతూ విజయవాడ నగర పాలక సంస్థ సర్కిల్-1 లోని 155వ వార్డు సచివాలయం లో వార్డు సంక్షేమ మరియు విద్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కళ్లేపల్లి విశ్వనాథ్ ఆకస్మికంగా గుండెపోటుకు గురై డిసెంబర్ 27 న మరణించడం బాధాకరమైన విషయమని.

విజయవాడ వార్డు కార్యదర్శులు ఏర్పాటుచేసిన సంతాప సభలో వార్డు సచివాలయ ఉద్యోగులందరు సమిష్టిగా మృతుని కుటుంబానికి అండగా నిలవాలని చేసుకున్న తీర్మాణం మేరకు విజయవాడ లో పనిచేస్తున్న వార్డు సచివాలయ ఉద్యోగులు అందరూ విజయవాడ నగర పాలక సంస్థ సెక్రెటరియట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రతీ వార్డు సచివాలయ ఉద్యోగి జీతంలోనుంచి కొంత నగదును సమీకరించి, ఆ సమీకరించిన మొత్తానికి అదనపు కమీషనర్ ( ప్రాజెక్ట్స్ ) డా. డి. చంద్ర శేఖర్ గారు కూడా కొంత నగదును మొత్తం Rs. 4,16,000/- . జమచేసి అందులో మొదట ₹1,16,000/- చెక్కు అందజేయగా రెండో విడతలో ₹300000 ఫిక్స్ డిపాజిట్ డాక్యుమెంట్ను అందజేశారని అన్నారు.

ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమీషనర్ ధ్యాన చంద్ర హెచ్. ఎమ్. ఐ.ఏ.ఎస్. మరియు అదనపు కమీషనర్ ( ప్రాజెక్ట్స్ ) డా. డి. చంద్రశేఖర్ తో పాటు విజయవాడ నగర పాలక సంస్థ సెక్రెటరియట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు మరియు ఇతర వార్డు కార్యదర్శులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments