Sunday, February 8, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshమద్యం తాగి దొరికితే రూ. 10 వేలు జరిమానా

మద్యం తాగి దొరికితే రూ. 10 వేలు జరిమానా

చీరాల: చీరాల ఒకటో పట్టణ ట్రాఫిక్ ఇంచార్జి ఎస్సై పవన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన పలువురిని పోలీసులు గుర్తించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వాళ్లని చీరాల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసులను పరిశీలించిన మెజిస్ట్రేట్, నిబంధనలను ఉల్లంఘించిన ఎనిమిది మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించారు.
ఈ సందర్భంగా, ఎస్ఐ, పవన్ మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజల ప్రాణాల భద్రత కోసమే ఇటువంటి తనిఖీలు కఠినంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడే వాళ్లపై ఇకపై కూడా చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజలు తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకోవాలంటే ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు.

#Narendra

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments