బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమా మహేశ్వరరావు ఆదేశాలమేరకు బాపట్ల పట్టణ సీఐ రాంబాబు ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై విజయ్ కుమార్ సోమవారం గడియార స్తంభం వద్ద విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీలలో భాగంగా, వాహనదారుల లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్ వంటి ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు అవగాహన కల్పించడంతోపాటు, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు.
ఈ సందర్భంగా బాపట్ల పట్టణ ఎస్ఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ…ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని ఆయన కోరారు. ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్, సీటు బెల్ట్ ప్రాణాలకు రక్షణ కల్పిస్తాయని గుర్తుచేశారు. ముఖ్యంగా, మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిరోజూ నిర్వహించే ఈ తనిఖీలు వాహనదారులను ఇబ్బంది పెట్టడం కోసం కాదని, ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించి ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ లక్ష్యమని ఎస్ఐ విజయ్ కుమార్ స్పష్టం చేశారు.
#Narwndra
