అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ గుణశేఖర్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం, కంభంవారిపల్లెలోని కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్లు నివేదిక అందింది. దీంతో ఫారంలోని కోళ్లను అధికారులు పూడ్చివేస్తున్నారు.
జిల్లాలోని 25 మండలాల్లో వ్యాధి విస్తరణపై పశువైద్య శాఖ అధికారులు పరిశీలించాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గుణశేఖర్ భరోసా ఇచ్చారు# కొత్తూరు మురళి. .




