Wednesday, February 11, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshఅసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష |

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష |

నేటి నుంచి (11.02.2026) ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన శాంతి భద్రతలు, భద్రతా ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సమీక్షించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో సీనియర్ పోలీస్ అధికారులు (ఐపీఎస్ అధికారులు) పాల్గొని, శాసనసభ పరిసరాల్లో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, భద్రతా చర్యలపై చర్చించారు.

ఈ సమావేశానికి గౌరవ శాసన సభ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు, రాష్ట్ర డీజీపీ శ్రీ హరిష్ కుమార్ గుప్తా, ఐపీఎస్ గారు, గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, ఐపీఎస్ గారు, గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్, ఐపీఎస్ గారు, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్, ఐపీఎస్ గారు, శ్రీ ఎ. మురళి గారు – చీఫ్ మార్షల్, శాసనమండలి, శ్రీ వి. గణేష్ గారు – చీఫ్ మార్షల్, శాసనసభ మొదలగు వారు హాజరైనారు.

అలాగే ఇతర సంబంధిత అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని గౌరవ స్పీకర్ గారు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments