చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో హంద్రీనీవా రివర్ ద్వారా కృష్ణ జలాలు పుంగమ్మ చెరువుకు చేరాయి. దీనితో మంగళవారం కోనేటిపాలెం వద్ద ఉన్న మరవను ఊరి ఆచారాల ప్రకారం ఘనంగా విడుదల చేశారు.
చెంగారెడ్డి వీధి నుంచి నగరి వీధుల గుండా అమ్మవారికి పూజాది ద్రవ్యాలతో పెద్ద చెంగారెడ్డి రంగారెడ్డి వంశస్థులు ఊరేగింపు నిర్వహించారు. జమీందారుల కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం మేరకు పుణ్యమ్మకు విశేష పూజలు చేసి మరవను విడుదల చేశారు.
ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు# కొత్తూరు మురళి.




