Wednesday, February 11, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradesh20 నెలల పాలనపై విజయాల జాబితా విడుదల |

20 నెలల పాలనపై విజయాల జాబితా విడుదల |

Chandrababu Naidu Outlines 60 Achievements of AP Government
ఎన్డీఏ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు సమావేశం
20 నెలల పాలనలో సాధించిన విజయాలను వివరించిన సీఎం

విధ్వంసం నుంచి వికాసం వైపు పురోగతి సాధించామన్న చంద్రబాబు
ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు పిలుపు
60 ప్రధాన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల జాబితా విడుదల

ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజున అసెంబ్లీ కమిటీ హాలులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. గడిచిన 20 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలను, చేపట్టిన అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం విధ్వంసం నుంచి వికాసం వైపు పురోగమిస్తోందని, ప్రతి రంగంలోనూ వృద్ధి నమోదైందని తెలిపారు. ప్రజావసరాలను గుర్తించి నిర్ణయాలు తీసుకుంటూ అతి తక్కువ కాలంలోనే ప్రజలు మెచ్చే పాలన అందించామని చంద్రబాబు అన్నారు. ప్రతి ఎమ్మెల్యే, మంత్రి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా, 20 నెలల కాలంలో ప్రభుత్వం చేపట్టిన 60 ప్రధాన కార్యక్రమాలు, సాధించిన విజయాల జాబితాను సీఎం వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:

1. తల్లికి వందనం: రూ.10,090 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ. 67.27 లక్షల మంది విద్యార్థులకు సాయం.
2. స్త్రీ శక్తి: 43.51 కోట్లకు పైగా ఉచిత బస్సు ప్రయాణాలు. రూ.1,532 కోట్లు ఖర్చు.
3. దీపం 2 పథకం: 1.08 కోట్ల కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్ల పంపిణీ. ఇప్పటికి 3.64 కోట్ల సిలిండర్లు అందజేత, రూ.2,891 కోట్లు వ్యయం.
4. అన్నదాత సుఖీభవ: 46.86 లక్షల మంది రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున సాయం. రెండు విడతల్లో రూ.6,310 కోట్లు జమ.
5. ఎన్టీఆర్ భరోసా: నెలకు 63 లక్షల మందికి పింఛన్లు. ఇప్పటికి రూ.58,654 కోట్లు వ్యయం.
6. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఎక్కడైనా పింఛను తీసుకునే అవకాశం.
7. మత్స్యకార భరోసా: ఏడాదికి రూ.20 వేల చొప్పున 1.25 లక్షల మందికి రూ.250 కోట్లు.
8. నేతన్నలకు ఉచిత విద్యుత్: మరమగ్గాలకు 500, మగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్. లక్షకు పైగా కుటుంబాలకు లబ్ధి.

9. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15,000 సాయం. రూ.436 కోట్లు జమ, 2.90 లక్షల మందికి లబ్ధి.
10. అన్న క్యాంటీన్లు: 113 నియోజకవర్గాల్లో 205 క్యాంటిన్ల ద్వారా 7.50 కోట్ల భోజనాలు.
11. గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపు, స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్.
12. వివాదాలకు తావివ్వకుండా ఎస్సీ వర్గీకరణ, అన్ని వర్గాలకు సమన్యాయం.
13. 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 గౌరవ వేతనం.
14. ఇమామ్‌లకు నెలకు రూ.10,000, మౌజన్లకు రూ.5,000 గౌరవ వేతనం.
15. అర్చకులకు వేతనం రూ.15,000కు పెంపు. నాయీ బ్రాహ్మణులకు నెలకు రూ.25,000, జూనియర్ లాయర్లకు రూ.10,000 గౌరవ వేతనం.

16. మెగా డీఎస్సీ ద్వారా 15,941 టీచర్ పోస్టుల భర్తీకి తొలి సంతకం.
17. 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకం పూర్తి. స్టైఫండ్ రూ.12,500కు పెంపు.
18. రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు.
19. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు. బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు.
20. ప్రతీ నెలా 3వ శనివారం ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’. చెత్తపన్ను రద్దు.
21. రూ.1,000 కోట్లతో రోడ్ల మరమ్మతులు, రూ.3,000 కోట్లతో నూతన రహదారులు.
22. కొత్తగా 25 పారిశ్రామిక పాలసీలు, 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు.
23. విశాఖ సీఐఐ సమ్మిట్‌లో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 16.13 లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు.
24. 14 ఎస్ఐపీబీ సమావేశాల్లో రూ.8.74 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం, 8.36 లక్షల ఉద్యోగాలు.
25. విశాఖలో రూ.1.25 లక్షల కోట్లతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు.

26. అమరావతిలో క్వాంటం వ్యాలీ భవనాలకు శంకుస్థాపన. విశాఖలో టీసీఎస్ ప్రారంభం.
27. కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు శంకుస్థాపన.
28. తిరుమల సహా ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదానాలు.
29. విశాఖలో యోగాంధ్ర, కర్నూలులో సూపర్ జీఎస్టీ సభ విజయవంతం.
30. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు, పేదలకు అదనంగా 110 వైద్య విద్య సీట్లు.
31. గ్రామ సభల ద్వారా 3 వేల పనులకు శ్రీకారం, పంచాయతీలకు నిధుల విడుదల, అమరజీవి జలధార పథకం.
32. విద్యా వ్యవస్థలో మార్పులు, మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం.
33. గేట్స్ ఫౌండేషన్, టాటాలతో సంజీవని ప్రాజెక్టు, యూనివర్సల్ హెల్త్ పాలసీ ప్రతిపాదన.
34. విద్యుత్ చార్జీల పెంపు లేదని ప్రకటన, ట్రూ అప్ భారాన్ని భరిస్తున్న ప్రభుత్వం.
35. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి డబుల్ డిజిట్ గ్రోత్ 11.28 శాతానికి చేరిక.

36. పేదలకు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తుల స్వీకరణ, 3 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు.
37. ఉచిత ఇసుక పథకం అమలు, నాలా యాక్ట్ రద్దు.
38. 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సోలార్ రూఫ్ టాప్.
39. తగ్గిన క్రైమ్ రేట్, గంజాయి-డ్రగ్స్ అరికట్టేందుకు ఈగల్ టాస్క్ ఫోర్స్.
40. మన మిత్ర ద్వారా వాట్సప్ గవర్నెన్స్‌తో 921 సేవలు.
41. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్ల అభివృద్ధికి కార్యాచరణ.
42. పూర్వోదయ పథకంలో రాష్ట్రానికి చోటు, రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆస్కారం.
43. విశాఖ రైల్వేజోన్ ప్రధాన కార్యాలయం పనుల ప్రారంభం.
44. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల కేంద్ర సాయం.

45. 90 కేంద్ర పథకాల పునరుద్ధరణ, నిధుల సద్వినియోగం.
46. రాష్ట్రానికి రూ.1 లక్ష కోట్ల విలువైన నేషనల్ హైవే, రైల్వే ప్రాజెక్టులు.
47. కొత్తగా రెండు జిల్లాల ఏర్పాటుతో మొత్తం 28 జిల్లాలు.
48. మహిళలకు లక్ష కుట్టు మిషన్ల పంపిణీ.
49. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ, 24 గంటల్లో రైతులకు రూ.8,120 కోట్లు జమ.
50. మార్కెట్ ఇంటర్వెన్షన్‌తో వివిధ పంటలకు రూ.1,100 కోట్లకు పైగా సాయం.
51. సమర్థ నీటి నిర్వహణతో 6.08 మీటర్లకు పెరిగిన భూగర్భ జలాలు.
52. సాగునీటి ప్రాజెక్టులకు 20 నెలల్లో రూ.23,793 కోట్ల ఖర్చు.

53. హంద్రీనీవా పనులు పూర్తి చేసి సీమకు 43 టీఎంసీల తరలింపు.
54. వెలిగొండ ప్రాజెక్టుకు రూ.571 కోట్లు వ్యయం.
55. శరవేగంగా పోలవరం నిర్మాణం, 2027 పుష్కరాలకు ప్రారంభం.
56. తుంగభద్ర గేట్ల మరమ్మతులకు ఏపీ వాటాగా రూ.55 కోట్లు.
57. రూ.610 కోట్లతో వివిధ ప్రాజెక్టుల మరమ్మతులు, రూ.878 కోట్లతో కాలువల నిర్వహణ.
58. 6,047 సాగునీటి సంఘాలకు ఎన్నికలు.
59. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రం మీదుగా 3 హై స్పీడ్ రైల్ కారిడార్లు.
60. ఆర్థిక కష్టాలు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులకు సంక్షేమ ఫలాలు.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments