Thursday, February 12, 2026
spot_img
HomeSouth ZoneTelanganaకాషాయ ముసుగులో కన్నింగ్ దొంగలు - వృద్ధులే లక్ష్యంగా చోరీలు .|

కాషాయ ముసుగులో కన్నింగ్ దొంగలు – వృద్ధులే లక్ష్యంగా చోరీలు .|

సికింద్రాబాద్.. ఆధ్యాత్మిక ముసుగులో పూజలు చేస్తామని నమ్మించి వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న మధ్యప్రదేశ్ ముఠాను వారాసిగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

నిందితుల నుండి ఐదు గ్రాముల బంగారు ఉంగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వారాసిగూడ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ తెలిపారు. మధ్యప్రదేశ్ కు చెందిన సుభాష్ నాథ్,కరణ్ నాథ్, సోహాన్ నాథ్ లు జీవనోపాధి కోసం హైదరాబాద్ పహాడ్ షరీఫ్ లో నివాసం ఉంటున్నారు. దృష్టిమరించి దొంగతనాలు చేయాలని పక్కా ప్రణాళిక తో కాషాయ వస్త్రధారణ లో స్వామీజీలుగా నమ్మబలుకుతూ లలిత నగర్ లో వృద్ధులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.

మంచినీళ్ల కోసం ఇంట్లోకి వెళ్లి వారికి మాయ మాటలు చెప్పి శాంతి పూజలు చేస్తామని నమ్మించారు. శాంతి పూజలు ఉంగరాన్ని ఉంచాలని చెప్పి తీసుకుని నోట్లో మింగేసి అక్కడినుండి ఆటోలో పరారయ్యారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వారాసిగూడ పోలీసులు సీసీ కెమెరాలు ఆధారంగా నిందితులను జల్ పల్లిలో గుర్తించి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.

#sidhumaroju
Alwal

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments