కడం మండల మద్దిపడగ గ్రామం లో గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలోని వార్డు సభ్యులు కాలనీల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. అంతర్గత రహదారుల మరమ్మతులు, డ్రైనేజీ, వీధి దీపాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. వార్డు సభ్యులు ప్రస్తావించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని సర్పంచ్ పంజాలా శకుంతల రామాగౌడ్ తెలిపారు. ఉప సర్పంచ్ రమణ, సెక్రటరీ మౌనిక, గ్రామస్థులు పాల్గొన్నారు.
#saketh
