బాపట్ల జిల్లా: కొత్తపాలెం గ్రామము మరియు చెరుకూరు గ్రామాలలో ఈరోజు నుంచి 17వ తేదీ వరకు వారం రోజులపాటు ఈ క్యాంపు జరుగుతుంది . ఈ ప్రత్యేక శిబిరాన్ని అసోసియేట్ డీన్ డాక్టర్ డి డి స్మిత్ కొత్తపాలెం పంచాయతీ సర్పంచ్ పాలపర్తి సంపూర్ణమ్మ మరియు చెరుకూరి పంచాయతీ సర్పంచ్ పాలేటి వీరయ్య గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ప్రత్యేక శిబిరం ప్రారంభించారు.
కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి డి గారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వ్యవసాయ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సర విద్యార్థులుతో ఒక వారం పాటు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం నిర్వహిస్తామని ఈ సంవత్సరం ఈ గ్రామాలలో ఏంచుకొని ఈ క్యాంపు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ గ్రామాలలో వారం రోజులపాటు నిర్వహించే వివిధ కార్యక్రమాలను వివరించారు. ప్రతి విద్యార్థి సేవాతప్రత అలవర్చుకోవాలని విద్యార్థులు అందరూ కూడా ఈ వారం రోజులు గ్రామ ప్రజలు రైతులతో కలివిడిగా ఉంటూ వారి వ్యవసాయ అనుబంధ సమస్యలు ఏమైనా ఉంటే వాటికి తగిన సూచనలు కళాశాల అధ్యాపకులను అడిగి రైతులకు చెప్పాలన్నారు.
ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీమతి పాలపర్తి సంపూర్ణమ్మ గారు పాలేటి వీరయ్య గారు మా గ్రామాలను ఎంచుకోవటం చాలా సంతోషకరమని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ గ్రామాల్లో స్థితిగతులను తెలుసుకొని మాక్కూడా తెలియజేయాలని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో కొత్తపాలెం గ్రామస్తులు శ్రీ కల్లం సింగారెడ్డి గారు శ్రీ కుసుమం వెంకట రెడ్డి గారు కళాశాల సిబ్బంది డాక్టర్ జి రవిబాబు డాక్టర్ కల్లం వెంకట సుబ్బరామిరెడ్డి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు డాక్టర్ డి విజయ్ కుమార్ డాక్టర్ ఎన్ అశోక్ కుమార్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు పాల్గొన్నారు.
#Narendra




