Thursday, February 12, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshతిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ. 32 లక్షలు

తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ. 32 లక్షలు

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. గత 97 రోజులకు సంబంధించిన హుండీ ద్వార రూ. 25,19,389 నగదు సమకూరగా.

అన్నదానం హుండీ ద్వారా రూ. 6,80,636 వసూలైనట్లు ఆలయ కమిటీ వెల్లడించింది.
మొత్తం ఆదాయం రూ. 32,00,025 గా నమోదైనట్లు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమం ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాదాయ విభాగం ఇన్‌స్పెక్టర్ ఫణీంద్ర కుమార్, పెద్దాపురం గ్రూప్ టెంపుల్ ఈఓ జి. జగదీశ్వర్ రావు పర్యవేక్షణలో జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments