మదనపల్లె జిల్లా ఆస్పత్రి అత్యవసర విభాగంలో కేవలం నలుగురు డాక్టర్లతోనే వెట్టిచాకిరి చేయిస్తున్నారని క్యాజువాలిటీ డాక్టర్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు.
గతంలో పది మంది డాక్టర్లు పనిచేసేవారని, ప్రస్తుతం మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ మరో ఇద్దరిని తగ్గించి నలుగురితోనే విధులు చేయిస్తున్నారని తెలిపారు. లక్షల జీతాలు తీసుకునే ఇద్దరు ఎముకల డాక్టర్లు ఏడాది కాలంగా అత్యవసర కేసులు చూడడం లేదని కూడా ఆరోపించారు.




