గత ప్రభుత్వ పాలక మండలి నిర్లక్ష్యం వల్లే తిరుమలలో అపచారాలు జరిగాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు.
శ్రీకాళహస్తిలో ₹10 కోట్లతో నిర్మించిన గిరిప్రదక్షిణ మార్గాన్ని ఆయన వర్చువల్గా ప్రారంభించారు. ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ₹40 కోట్లతో 22 ప్రధాన ఆలయాలకు రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు.
భక్తిని, సంస్కృతిని కాపాడటం అందరి బాధ్యతని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.




