పుంగనూరులో సిపిఐ, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి.
కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు జనార్ధన్, సాంబశివ తదితరులు పాల్గొన్నారు.
పోరాటాల ద్వారానే కార్మిక హక్కులను కాపాడుకుంటామని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడుతామని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.
# కొత్తూరు మురళి.




