Friday, February 13, 2026
spot_img
HomeSouth ZoneAndhra Pradeshతాడేపల్లిలో అక్రమ కట్టడం కూల్చివేత!

తాడేపల్లిలో అక్రమ కట్టడం కూల్చివేత!

తాడేపల్లి మహానాడు ప్రాంతంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనాన్ని మున్సిపల్ అధికారులు శుక్రవారం కూల్చివేశారు.

మూడు అంతస్తులు పూర్తయ్యే వరకు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో కథనాలు రావడంతోనే అధికారులు స్పందించారని స్థానికులు చర్చించుకుంటున్నారు.

కాగా, వార్తలు కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధిపై ఓ అధికారి చిందులు తొక్కడం, అనుమతి అడగడం వివాదాస్పదంగా మారింది. ఆదిలోనే అక్రమ కట్టడాలను అరికట్టడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments