మెడికల్ మాఫియాపై సీపీఐ పోరు!

0
0

మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మెడికల్ మాఫియా, బోగస్ మందులకు వ్యతిరేకంగా సీపీఐ శనివారం నిరసన చేపట్టింది. నాణ్యత లేని మందులతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని జిల్లా కార్యదర్శి మహేష్, తోపు కృష్ణప్ప మండిపడ్డారు.

డ్రగ్ కంట్రోల్ వ్యవస్థను బలోపేతం చేసి తనిఖీలు చేపట్టాలని, అనవసర పరీక్షలు, అధిక ధరలతో రోగులను దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.