మదనపల్లె రైల్వే స్టేషన్‌లో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. సిటిఎం పెద్దపల్లికి చెందిన రెడ్డమ్మ (65) రైల్వే ట్రాక్ దాటేందుకు మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డారు.
ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి అవుట్‌పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు.
రైల్వే స్టేషన్లలో వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
